" " జన విజ్ఞాన వేదికలో చేరండి ! సామాన్యులకు సైన్స్ ఫలాలను అందించండి.!!     " జె.వి.వి. అంటే జన విజ్ఞాన వేదిక. జనానికి విజ్ఞాన ఫలాలను అందించే సంస్థ . " <     " జనంకోసం కోసం సైన్స్ , శాంతికోసం సైన్స్ , దేశ సమైక్యత కోసం సైన్స్ అనే నినాదాలతో , భావంతో బాధ్యతగా ఏ రాజకీయ పార్టీకీ అనుబంధం లేకుండా , ఉత్తమ పౌర సమాజాన్ని నిర్మించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థ " జన విజ్ఞాన వేదిక " " <     " జె.వి.వి. ఆరోగ్య నినాదాలు: చక్కర ఉండగా...గ్లూకోజ్ దండగ ! " <     " సిగిరెట్టు చావుకు తొలి మెట్టు. గుట్కా తింటే గుటుక్కుమంటావ్. సారాయి త్రాగితే సరాసరి చావుకే! " <

Saturday 26 January 2013


































మూఢ నమ్మకాలను విడనాడండి 
సూర్యా కాన్సెప్ట్ స్కూల్ లో జరిగిన సమావేశం లో విద్యార్ధులకు జన విజ్ఞాన వేదిక సందేశాన్ని అందిస్తున్న విశాఖ జిల్లా జె.వి.వి. ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి శంకర ప్రసాద్ 

పరీక్షలంటే భయమెందుకు? 
కశింకోట బాలికోన్నపాఠశాలలోజన విజ్ఞాన వేదిక సందేశాన్ని అందిస్తున్న
 విశాఖ జిల్లా జె.వి.వి.కార్యదర్శి పిళ్లా రవి శంకర్ 



శీతల పానీయాలు తాగొద్దు!    -  జె.వి.వి. 
శీతల పానీయాల వాళ్ళ వచ్చే నష్టాలను వివరించే పోస్టర్లను విడుదల చేస్తున్న జె.వి.వి. సైనికులు. 


















అద్భుత శిక్షణా శిబిరం 
విశాఖ జిల్లా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 25-1-2013న అనకాపల్లి లో  నిర్వహించిన ఒకరోజు వర్క్ షాప్ కు విశేష స్పందన  లభించింది. ప్రఖ్యాత వైద్యులు,  జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డా. వి. బ్రహ్మారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య  అతిధిగా హాజరై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. 200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు,   వివిధ రంగాలకు చెందిన సమాజ శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం 9-30 నుండి సాయంత్రం 
5-15 వరకు నిర్వహించబడిన ఈ అద్భుత కార్యక్రమంలో  వ్యక్తిత్వ వికాసం,  జీవన నైపుణ్యాలు, ఉత్తమ మానవ సంబంధాలు,  జన విజ్ఞాన వేదిక లక్ష్యాలు అన్న అంశాలపై డా.  బ్రహ్మారెడ్డి విజ్ఞాన దాయకమైన, స్ఫూర్తివంతమైన విషయాలను అందించారు. ఉదయం హాజరైన విద్యార్థులు, ఉపాధ్యాయులు,  శిక్షణార్దులందరూ  సాయంత్రం వరకూ తమ స్థానాలనుండి కదలకుండా , అత్యంత క్రమశిక్షణతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం 
విశేషం. విశాఖ  జిల్లా అధ్యక్షులు కె. జనార్ధన్, ప్రధాన కార్యదర్శి డా.తల తోటిపృధ్వీ రాజ్, ప్రచార కార్యదర్శి మల్లారెడ్డి శంకరప్రసాద్ , కోశాధికారి ఎస్. సోమేశ్, కార్యదర్శులు ఎ. వి. ఎన్ మూర్తి, పిళ్ళా రవి శంకర్, ఉమా  మహేశ్వర  రావు,ఆచంట రవి, బి చిన్నారావు, డి ఎస్. మల్లేశ్వర రావు జిల్లా కార్యవర్గ సభ్యులు 
ఈ కార్యక్రమాన్ని అంకితభావంతో నిర్వహించారు.